3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
NEWS Jan 25,2026 05:53 pm
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని చెప్పారు. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం.. ఈ పథకం వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.