13 మంది తెలుగు వారికి పద్మ అవార్డులు
NEWS Jan 25,2026 04:48 pm
కేంద్ర ప్రభుత్వం 2026 పద్మ అవార్డులను ప్రకటించింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్‌ను దిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది. ఏపీ, తెలంగాణకు చెందిన 13 మందికి పద్మ పురస్కారాలు వరించాయి.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు..
సినీనటుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ - కళలు
సినీనటుడు మురళీ మోహన్ - కళలు
కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ - సైన్స్ & ఇంజినీరింగ్
పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి - వైద్యం
గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ - కళలు
డా. కుమారస్వామి తంగరాజ్ - సైన్స్
రామారెడ్డి మామిడి (మరణానంతరం) - పశుసంవర్థక, పాడి పరిశ్రమ
వెంపటి కుటుంబశాస్త్రి - సాహిత్యం
గూడూరు వెంకట్రావు - వైద్యం
దీపికా రెడ్డి - నృత్యకారిణి
గడ్డమనుగు చంద్ర మౌళి - సైన్స్ విభాగం