వాహనాలపై హోదా స్టిక్కర్లు వద్దు
NEWS Jan 26,2026 04:23 am
వాహనాలపై పోలీస్, ప్రెస్, అడ్వకేట్ వంటి వివిధ హోదాల స్టిక్కర్ల వినియోగంపై తెలంగాణ ప్రభు త్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అనధికారికంగా ప్రభుత్వ చిహ్నాలు, జెండాలు, వృత్తి పేర్లు వాడితే చర్యలు తప్పవని I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లపై ఎలాంటి రాతలు ఉండకూడదని హెచ్చరించారు. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై 'PRESS' అనే పదాన్ని ఉపయోగించాలన్నారు.