అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే
NEWS Jan 26,2026 10:33 am
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. హైకోర్టు సమీపంలోని మైదాన పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.