నిర్మల్ జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు
NEWS Jan 26,2026 11:35 am
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో వివరించారు. వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.