గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని మోదీ.. ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏటా గణతంత్ర వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు. సిల్క్ బ్రోకేడ్ వస్త్రంతో తయారు చేసిన ఈ తలపాగా రాజస్థానీ హస్తకళా నైపుణ్యాన్ని గుర్తుకు తెచ్చింది.