కడలి గర్భంలో మువ్వన్నెలజెండా రెపరెపలు
NEWS Jan 26,2026 02:46 pm
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర గర్భంలో స్కూబా డైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. నేవీ మాజీ అధికారి, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నేతృత్వంలో 5గురు సభ్యుల బృందం 77 అడుగుల లోతులో జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. రుషికొండ తీరం సమీపంలో సముద్రంలో డైవ్ చేసి, జెండాతో ప్రత్యేక ప్రదర్శన చేశారు. నీటి అడుగున గుర్రంపై స్వారీ చేసినట్టు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.