ఫిబ్రవరి 17న పిల్లలకు ఫ్రీగా మాత్రలు
NEWS Jan 26,2026 02:53 pm
ఏపీ ప్రభుత్వం 21వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపట్టనుంది. 1 నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న 1,11,63,762 మంది పిల్లలకు ఉచితంగా ఈ మాత్రలు అందిస్తారు. స్కూళ్లు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుంది. నులిపురుగుల వల్ల రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు. ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు.