అబ్బాపురం జడ్పీ పాఠశాలలో రిపబ్లిక్ డే
NEWS Jan 26,2026 03:22 pm
అబ్బాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ తప్పెట్ల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో గెలిచిన విద్యార్థులకు క్రిస్టల్ కంపెనీ నుంచి రూ.10 వేల విలువైన బహుమతులు అందించారు. ఉపసర్పంచ్ తిరుపతి, ఫర్టిలైజర్ షాప్ యజమానులు రాజేందర్, అన్న రాజు బూస ప్రవీణ్, వార్డుసభ్యులు, ప్రధానోపాధ్యాయులు హనుమాన్, ఉపాధ్యాయులు డా.కందాల రామ య్య, ప్రభావతి, సురేందర్, షీలా, మణి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.