హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా రేవంత్
NEWS Jan 26,2026 06:27 pm
సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రారంభించారు. కేంబ్రిడ్జ్‌లోని కెన్నడీ స్కూల్‌లో ‘లీడర్‌షిప్ ఇన్ ది 21వ సెంచరీ’ కోర్సులో చేరి రోజంతా క్లాసులు, గ్రూప్ వర్క్‌లో పాల్గొంటున్నారు. జనవరి 30 వరకు కోర్సు కొనసాగనుంది. సీఎం హోదాలో ఐవీ లీగ్ యూనివర్సిటీలో చేరిన తొలి సీఎం అని సీఎంవో తెలిపింది. తీవ్ర మంచు తుపాను పరిస్థితుల్లోనూ తరగతులకు హాజరవుతున్నారు.