వరప్రసాద్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు
NEWS Jan 27,2026 05:23 am
కొత్తగూడెంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములకలపల్లి మండలానికి చెందిన మిషన్ భగీరథ ఏఈఈ వరప్రసాద్‌కు ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యావసరమైన రక్షిత మంచినీటిని సకాలంలో అందిస్తూ నిబద్ధతతో సేవలందించినందుకు ఈ గౌరవం దక్కింది. కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజులు కలిసి ప్రశంసా పత్రాన్ని వరప్రసాద్‌కు అందజేశారు. ప్రజలతో నిత్యం మమేకమై పనిచేస్తున్న ఆయన సేవలను అధికారులు ప్రశంసించారు.