కార్పొరేటర్ బరిలో కేతని కుమారి
NEWS Jan 27,2026 11:16 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కేతని సావిత్రి కుమారి బీజేపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆమె బరిలోకి దిగారు. ఈ సందర్భంగా కేతని సావిత్రి కుమారి మాట్లాడుతూ, డివిజన్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నిరంతరం సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు.