57 బంతుల్లోనే 100 పరుగులు
NEWS Jan 27,2026 11:13 am
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో నాట్ సివర్-బ్రంట్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. వడోదరాలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 57 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి తొలి సెంచరీ సాధించింది. 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరిసిన ఆమె, హేలీ మాథ్యూస్‌తో కలిసి రెండో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ప్లేఆఫ్ రేసులో కీలక మ్యాచ్‌గా నిలిచింది.