2026లోనే ₹2 లక్షలు దాటనున్న గోల్డ్
NEWS Jan 27,2026 11:20 am
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.1.6 లక్షల వద్ద ఉండగా, ఈ ఏడాది చివరికి 10 గ్రాముల బంగారం ధర రూ.2.2 లక్షలకు చేరవచ్చని నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, కేంద్ర బ్యాంకుల భారీ బంగారం కొనుగోళ్లు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. 2026 ప్రారంభమైన 26 రోజుల్లోనే బంగారం ధర 18 శాతం పెరిగింది. ఆర్‌బీఐ కూడా పసిడి నిల్వలను పెంచుతోంది.