ఆడ తోడు కోసం పెద్దపులి లాంగ్ జర్నీ!
NEWS Jan 27,2026 11:24 am
యాదాద్రి జిల్లాలో 2 వారాలుగా పెద్ద పులి సంచారం భయందోళనలు రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగ దూడలపై దాడులు చేస్తోంది. అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400 కి.మీ ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు.