భారీగా పెరిగిన వెండి ధర
NEWS Jan 27,2026 11:32 am
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరిగాయి. KG సిల్వర్ రేటు ఏకంగా రూ.12వేలు పెరిగి రూ.3,87,000కు చేరింది. 11 రోజుల్లోనే వెండి ధర ₹81వేలు పెరగడం గమనార్హం. అటు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులేదు. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,61,950, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,48,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.