మెట్‌పల్లి KDCC బ్యాంక్ సిబ్బంది నిరసన
NEWS Jan 27,2026 07:45 am
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేపట్టాలని, 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లి కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది ఒక్కరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ రంగాల్లో ఇప్పటికే 5 రోజుల పనిదినాలు అమలులో ఉన్నాయని గుర్తుచేశారు. అదే విధానాన్ని బ్యాంక్ సిబ్బందికీ వర్తింపజేయాలని కోరారు. దీర్ఘ పని గంటలు, అధిక పని ఒత్తిడి కారణంగా ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.