మేడారంలో అంతర్జాతీయ వైభవం నెలకొంది. న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ తెగ గిరిజనులు మేడారం చేరుకుని సమ్మక్క-సారక్క వనదేవతలను దర్శించుకుని భక్తితో మావోరీ గిరిజనులు వనదేవతల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మావోరీ గిరిజనులు తమ సాంప్రదాయమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. మంత్రి సీతక్క వారితో కలిసి నృత్యం చేశారు. నినాదాలు, శరీర కదలికలతో కూడిన ఈ నృత్యం.. మేడారం జోష్ నింపింది.