DNR ట్రస్ట్ నుంచి SSC స్టడీ మెటీరియల్
NEWS Jan 27,2026 05:14 pm
SSC పరీక్షల్లో విద్యార్థులు 100% ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో DNR ట్రస్ట్ ‘DNR విజయ పథం’ కార్యక్రమాన్ని చేపట్టింది. DNR ట్రస్ట్ అధినే త దొడ్డా ప్రతాపరెడ్డి నేతృత్వంలో డా.కందాల రామయ్య సమన్వయంతో స్టేట్ రిసోర్స్ పర్సన్స్ రూపొందించిన SSC స్టడీ మెటీరియల్‌ను ములుగు జిల్లా సహా పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. దొడ్డ ప్రతాప్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ, ముద్రణ, పంపిణీకి ₹15 లక్షలకు పైగా వ్యయం చేశారు.