6 సార్లు డిప్యూటీ.. ‘సీఎం’ కల తీరకుండానే..
NEWS Jan 28,2026 12:48 pm
మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ అజిత్ పవార్. తన అనూహ్య నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. సీఎం కల తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. శరద్ పవార్ కుటుంబానికి చెందిన అజిత్, 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ విభేదాలు, తిరుగుబాట్లతో తరచూ వార్తల్లో నిలిచిన ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటుగా మారింది.