నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
NEWS Jan 28,2026 06:39 pm
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు నుండి 30వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు సాఫీగా నామినేషన్లు వేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.