కాంగ్రెస్ అభ్యర్థిగా సఫియా నామినేషన్
NEWS Jan 31,2026 10:32 pm
మెట్‌పల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సఫియా రజాక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు ప్రజలతో కలిసికట్టుగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.