రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
NEWS Oct 01,2026 11:13 pm
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నర్సీపట్నం డివిజనల్ ఈఈ బి. వెంకటరమణ తెలిపారు. RDSS పనులు, సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల మార్పు కారణంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.