మెట్ పల్లిలో అంగన్వాడీల ర్యాలీ
NEWS Feb 12,2026 09:17 pm
4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ AITUC ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో జిల్లాలోని అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వ్యవసాయ మార్కెట్లో సమావేశమయ్యారు. అనంతరం బస్సు డిపో నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ శ్రీనివాస్‌కు వినతి అందించారు. అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ టీచర్లుగా గుర్తించి కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలు పెంచి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.