దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
NEWS Feb 22,2026 11:22 am
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన దివ్యాంగులకు పురస్కారాలు అందించారు. దివ్యాంగులకు మద్దతు ఇస్తే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ర్యాకల లక్ష్మినారాయణ గౌడ్ అన్నారు. కళాప్రదర్శనలు చేసిన చిన్నారుల కు మెమోంటోలు అందించారు. మట్ట రాజుగౌడ్, మధుసూదన్ గౌడ్, శేఖర్ గౌడ్, నటి రాగిణి పాల్గొన్నారు.