బాల సంఘం అధ్యక్షుడిగా శంకర్
NEWS Feb 22,2026 11:24 pm
కథలాపూర్: బాల సంఘం అధ్యక్షునిగా కల్లెడ శంకర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్‌ను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి చూపుతానని, గత 30 ఏళ్ల నుండి బాల సంఘం మండల అభివృద్ధికి కృషి చేస్తుందని దీనిలో నాకు అధ్యక్షుని పదవి ఇవ్వడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఉంచి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంజీవరెడ్డి, రాజ్ కుమార్, తిరుపతి రెడ్డి, చిలుక వెంకటేష్, నయీం తదితరులు పాల్గొన్నారు.