ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్
- కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్
NEWS Feb 25,2026 05:31 pm
నిర్మల్ : ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు హాజరవుతున్న జిల్లా విద్యార్థులందరికీ 9వ వార్డు సభ్యుడు మంచాల శ్రీకాంత్ యాదవ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి, తమ ప్రతిభను ప్రదర్శించి ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.