బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక
NEWS Mar 02,2026 03:30 pm
పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేర్లతో పేదల ఇళ్లు కూల్చడం అన్యాయమని విమర్శించారు. ఇదే కొనసాగితే పెద్దల ఇళ్లపై బుల్డోజర్లతో నిరసన చేపడతామని అన్నారు. ఖమ్మంలో విద్యార్థుల పరీక్షల సమయంలో కూల్చివేతలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రజలు ఏకమై బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.