ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మోదీ
NEWS Mar 02,2026 03:39 pm
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ యుద్ధానికైనా శాంతి మార్గమే శాశ్వత పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సంభాషణ, దౌత్యపరమైన చర్యల ద్వారానే సమస్యలు పరిష్కరించాలన్నారు. భారతదేశం ఎప్పటికీ శాంతి, స్థిరత్వానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. దేశాలన్నీ కలిసి ఉద్రిక్తతలను తగ్గించి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు