'నర్సంపేట పట్టణ అభివృద్ధే లక్ష్యం'
NEWS Mar 07,2026 01:23 pm
నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డులో చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్నతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.