విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. గిన్నిస్ అవార్డును మంత్రి అందుకున్నారు. రేపు (శనివారం) భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి ఆదివాసీలు స్వాగతం పలకనున్నారు. గత 3 రోజులుగా ఆదివాసీ విద్యార్థినులు రిహార్సల్స్ చేస్తున్నారు.