గిల్ డబుల్ సెంచరీతో జైత్రయాత్ర!
NEWS Sep 30,2026 11:42 pm
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో కదంతొక్కగా.. సారథి గిల్ ద్విశతకంతో విరచుకుపడ్డాడు. విండీస్ బౌలర్లకు వణుకు పుట్టిస్తూ బౌండరీలతో చెలరేగిన అతడితో రుతురాజ్ (31 నాటౌట్) ఆఖరి దాకా నిలబడ్డాడు. కొండంత లక్ష్యాన్ని కరిగించి.. 8 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.