పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అమలును ప్రారంభించింది. కుటుంబ పెద్దకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్నవారు అర్హులు. రేషన్, ఆధార్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించనున్నారు. నవంబర్ 23 నుంచి గ్రామాల క్లస్టర్ల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాల్లోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 18 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
LATEST NEWS
Telangana, Hyderabad
పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
కైశిక ద్వాదశి
Nov 22,2026 12:03 am
‘ది గేమ్ ఆఫ్ సాంగ్’ మూవీ ట్రైలర్‌ను
వీక్షించి ప్రశంసించిన శరత్ కుమార్
Nov 21,2026 06:35 pm
25 రోజుల్లో 52 లక్షల పెళ్లిళ్లు!
Nov 21,2026 10:23 am
అత్యవసర సమయంలో రాజ్‌కుమార్ రక్తదానం
Nov 20,2026 10:19 pm