www.breakingnow.app | Sun, 22 Nov 2026
VIRAL Telangana, Mahabubabad

రేకుల దుకాణానికి ₹2.12 లక్షల అద్దె

Share:
128 Views
రేకుల దుకాణానికి ₹2.12 లక్షల అద్దె

మహబూబాబాద్‌: కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ చిన్న రేకుల దుకాణానికి భారీ అద్దె పలికింది. ఆలయ అధికారులు నిర్వహించిన వేలంలో ఈ దుకాణం నెలకు రూ.2.12 లక్షలకు అమ్ముడైంది. కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయించే ఈ కొట్టును స్థానిక వ్యాపారి బండారి రమేశ్‌ అత్యధిక ధరకు దక్కించుకున్నారు. ఆలయ తూర్పు రాజగోపురం పక్కన ఉన్న ఈ దుకాణానికి గత ఏడాది నెలకు ₹93,600 అద్దె మాత్రమే వచ్చింది. ఈసారి రెట్టింపునకు పైగా ధర పలకింది. భక్తుల రద్దీతో పుణ్యక్షేత్రాల పరిసరాల్లో వాణిజ్య స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ వేలం నిదర్శనంగా నిలిచింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.