దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచారణ
NEWS Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్ క్రాకర్స్‌కు షరతులతో అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. బాణసంచా వినియోగానికి నిర్దిష్ట సమయాలు, శబ్ద స్థాయి, పరిమాణంపై నిబంధనలు విధించే అవకాశం ఉంది. బేరియం క్రాకర్స్‌పై సీపీసీబీ నివేదిక సమర్పించాల్సి ఉండగా, తదుపరి విచారణ అక్టోబర్ 15న జరగనుంది.