వాడవాడలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
NEWS Apr 01,2026 10:25 am
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డు టీడీపీ అధ్యక్షుడు సారిపల్లి మహేశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గడపగడపకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కార్యక్రమంలో యూనిట్ ఇన్‌చార్జ్ ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, బూత్ ప్రెసిడెంట్లు ఎల్లాజీ, మూర్తి, నాని, రామకృష్ణ, వెంకీ, మంగ, జగ్గనాథంరావు, రవి, రెడ్డి, రియాజ్, ఆదిత్యతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.