రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్
NEWS Apr 01,2026 11:13 am
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యాయి. పౌల్ట్రీ కంపెనీలు కిలోకు ఇచ్చే మార్జిన్‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో షాపుల నిర్వహణ నష్టంగా మారిందని యజమానులు తెలిపారు. రెంటు, కూలీల జీతాలు, కరెంట్ ఖర్చులు భరించలేక బంద్‌కు దిగామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 50 వేల షాపులు మూతపడగా, హైదరాబాద్‌లోనే 25 వేల దుకాణాలు ప్రభావితమయ్యాయి. మార్జిన్ పెంచేవరకు ఆందోళన కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రకటించింది.