ఎంఏ జాన్‌కు రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్
NEWS Apr 11,2026 04:41 pm
ఇటీవల ప్రకటించిన మహాసర్బ్ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాల్లో ఎం.ఏ. జాన్ బీసీసీ కేటగిరీలో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో 239వ ర్యాంక్ సాధించి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కిషన్ మాట్లాడుతూ యువత చదువుపై ఆసక్తి పెంచుకుని విజయాలను సాధించాలని సూచించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. జాన్ సాధించిన విజయం గర్వకారణమని అభినందించారు.