యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
NEWS May 14,2026 01:55 pm
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు. క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు ధ్వంసమయ్యాయి.