రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే
NEWS Jun 02,2026 02:21 pm
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సందేశమిస్తూ, ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అమరావతి, హైదరాబాద్ నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని కోరుకున్నారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందాలని, మెరుగైన జీవన ప్రమాణాలు కలగాలని ఆకాంక్షించారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేసి తెలుగు ప్రజల వైభవాన్ని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.