PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్
NEWS Jun 19,2026 06:38 am
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై ప్రసంగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించడం, సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యమని పీఐబీ అధికారులు తెలిపారు.