రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. ఏపీలో అధునాతన అగ్నిమాపక వాహనాలు ప్రారంభం అయ్యాయి. వాహనాలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సీడ్ యాక్సెస్ రోడ్‍లో వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. రూ.40కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు సమకూర్చింది ప్రభుత్వం. ఇందులో 25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు మరియు అడవి ప్రాంతాల రక్షణ కోసం వీటిని కేటాయించారు.వాటర్ బౌజర్లు పెద్ద ప్రమాదాల సమయంలో నిరంతర నీటి సరఫరా అందిస్తాయి.ఇక క్విక్ రెస్పాన్స్ యంత్రాలు ఇరుకైన ప్రాంతాల్లో వేగంగా చేరుకోవడానికి సహాయపడతాయి.అమరావతి ప్రాంతంలో గతంలో జరిగిన కొన్ని అగ్నిప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసింది.