విద్యార్థులను ప్రోత్సహించిన మాజీ మంత్రి
NEWS Aug 15,2026 01:12 pm
కరీంనగర్: పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన గల్ఫ్ హైస్కూల్ విద్యార్థులకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యిద్ ముఖద్దర్ అలీ ఆధ్వర్యంలో ముగ్గురికి రూ.5 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ చొరవను కొనియాడారు.