బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
NEWS Aug 15,2026 02:48 pm
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ టెక్ కంపెనీలో అతను గత ఏడాది కాలంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మాలిక్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.