బుచ్చయ్యపేట మండల వ్యవసాయ అధికారి నారాయణరావు మాట్లాడుతూ పంటల బీమా నమోదుకు తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ఉన్న గడువును ప్రభుత్వం 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. పంట నష్టం సంభవించినప్పుడు బీమా ద్వారా ఆర్థిక భరోసా పొందవచ్చని తెలిపారు.