జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ హ.త్యకు కుట్ర
NEWS Aug 17,2026 02:48 pm
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ కుట్ర పన్నినట్లు సమాచారం. ఓ రౌడీషీటర్‌తో వైసీపీ నేత నరేంద్ర రెడ్డి సుపారీ మాట్లాడినట్లు తెలుస్తోంది. హత్య కోసం రూ.కోటిన్నరకు ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం. ఉదయం జిమ్‌కు వెళ్లే క్రమంలో జనసేన నేతను హత్య చేయాలని పథకం పన్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు సార్లు ఆ ముఠా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డి అక్రమాలను గతంలో శ్రీనివాస యాదవ్ అడ్డుకున్నారు.