ఆవు ఒకే కాన్పులో 2 ఆడ దూడలు
NEWS Aug 17,2026 02:26 pm
రాయికల్: మండలంలోని రాజ్‌నగర్ గ్రామానికి చెందిన బొమ్మన నరసయ్యకు చెందిన ఆవు సోమవారం వేకువజామున ఒకే కాన్పులో 2 ఆడ దూడలకు జన్మనిచ్చింది. సాధారణంగా ఆవులు ఒకేసారి ఒక దూడకు జన్మనివ్వడం సహజం కాగా, ఒకే కాన్పులో 2 ఆడ దూడలు పుట్టడంతో గ్రామంలో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. గ్రామస్థులు, చుట్టుపక్కల వారు నరసయ్య ఇంటికి చేరుకుని ఆసక్తిగా తిలకించారు. ఈ అరుదైన ఘటన గురించి గ్రామంలో పలువురు చర్చించుకున్నారు. ప్రస్తుతం తల్లి ఆవుతో పాటు రెండు ఆడ దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని యజమాని తెలిపారు.