రావణాపల్లి రిజర్వాయర్ నీటి విడుదల
NEWS Aug 18,2026 08:36 pm
గొలుగొండ మండలంలోని రావణాపల్లి రిజర్వాయర్ గేట్లను నర్సీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ పూజలు నిర్వహించి ఎత్తి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ కింద 2,600 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కృషితో మరమ్మతులకు రూ.కోటి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రైతులు సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.