అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్ అందజేత.
NEWS Aug 18,2026 08:31 pm
రాయికల్ మండలం ఒడ్డెర కాలనీ అంగన్వాడీ కేంద్రానికి వార్డు సభ్యురాలు సూర మాధురి మురళి దంపతులు స్వచ్ఛందంగా ఫ్యాన్ అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రోజా గణేష్ దంపతులు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తాయని సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులున్నారు.