మాగండ్లపల్లి రైతులకు న్యాయం చేయాలి
NEWS Aug 18,2026 08:30 pm
మాగండ్లపల్లి–మద్దనపల్లెకు చెందిన 29 మంది రైతుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అసలు హక్కుదారులకు న్యాయం చేయాలని బీసీవై పార్టీ డిమాండ్ చేసింది. రైతులతో కలిసి అన్నమయ్య జిల్లా సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేసింది. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.